![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో.. సీతాకాంత్ తన పోలీస్ ఫ్రెండ్స్ ని బయటకు పంపించి.. మాణిక్యంతో సీతాకాంత్ మాట్లాడతాడు. నీకు ఇరవై నాలుగు గంటల టైమ్ ఇస్తున్న ఆ తర్వాత నువ్వు ఎక్కడున్న నిన్ను బ్రతకనివ్వనంటూ సీతాకాంత్ మాణిక్యానికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీతాకాంత్ కోపంగా ఇంటికి వచ్చి సిరిని కొట్టబోయి ఆగుతాడు. ఎలాంటి వాడిని ప్రేమించావో తెలుసా.. ఇక మీ పెళ్లి జరగదు వాడిని మర్చిపోమని సిరికి సీతాకాంత్ చెప్తాడు. లేదు అన్నయ్య ధన చాలా మంచోడని సిరి చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరు వాళ్ళ దగ్గరికి వస్తారు.
వాడు నిన్ను ప్రేమించలేదు.. ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. దాని వెనకాల పెద్ద కుట్ర ఉందని సీతాకాంత్ చెప్పగానే శ్రీలత షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది కుట్ర ఏంటి అని అడుగుతుంది. వాడెవడో కాదు ఆ మాణిక్యం కొడుకు. ఆ రామలక్ష్మి కూడా వాడి కూతురే అని చెప్పాగానే శ్రీలత షాక్ అవుతుంది. వాడి వల్లే మన నాన్న మనకి దూరం అయ్యాడు. నీ ప్రేమని మర్చిపో.. కాదు కాదు మర్చిపోయావంటూ సిరికి సీతాకాంత్ చెప్పేసి వెళ్తాడు. ఆ తర్వాత ఎవరమ్మ ఈ మాణిక్యం అని శ్రీలతని సందీప్ అడుగుతాడు. సందీప్ ని ఆ మాణిక్యం ఫోటో దగ్గరికి శ్రీలత తీసుకొని వెళ్లి.. వీడే అని చెప్తుంది. అతనెవరు అని సందీప్ అడుగగా... వాడి గురించి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. కానీ వాడు ఉండకూడదు. నేను ప్రశాంతంగా ఉండలేనని.. రౌడీలకి శ్రీలత ఫోన్ చేసి మాణిక్యాన్ని తీసుకొని రమ్మని చెప్తుంది. ఆ తర్వాత వాడు ఇన్ని రోజులకి కన్పించాడు. ఇక కన్పించవ్.. నా గురించి నోరు విప్పవని శ్రీలత అనుకుంటుంది.
ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి లగేజ్ సర్దు ఇల్లు కాళీ చేసి వెళ్ళాలని చెప్తుంది. ఆ తర్వాత మాణిక్యం వస్తాడు. వాళ్ళు చెప్పింది నమ్ముకుతున్నావా అని రామలక్ష్మిని మాణిక్యం అడుగుతాడు. కన్నకూతురికి ఇన్ని రోజులు అబద్ధం చెప్పావ్.. వాళ్ళని మోసం చేసావ్ అంటు మాణిక్యాన్ని రామలక్ష్మి తిడుతుంది. మరొకవైపు రౌడీలు మాణిక్యం ఇంటికి వస్తారు. వాళ్లు వచ్చేలోపే రామలక్ష్మి కుటుంబంతో సహా తాళం వేసి వెళ్లిపోతారు. అదే విషయం రౌడీలు శ్రీలత కి ఫోన్ చేసి చెప్పగానే.. శ్రీలత డిస్సపాయింట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం.. రామలక్ష్మి పరిచయం అయిన దగ్గర నుండి జరిగినవన్నీ సీతాకాంత్ గుర్తుకుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |